అద్దాల మేడల కోసం, అందాల బామల కోసం మేము పని చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో ఆయన మంత్రులతో కలిసి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. దుబాయ్ వెళ్లి సుందకరణ కోసం గుండు మీద జుట్టు పెంచుకోవడం కోసం మేము పని చేయడం లేదన్నారు. అలాంటి పాలకుల నిర్లక్ష్యం వల్ల మూసీ నది మురికి కుంపంగా మారిందని తెలిపారు. మూసీ వల్ల మాకు ఆర్థిక ప్రయోజనం ఏమైనా ఉందా..? మూసీలో ఉన్న మురికి కంటే.. మీ మెదళ్లలో విషం నింపుతున్నారు.
సిటీ మధ్యలో నుంచి నది ప్రవహించే నగరం దేశంలోనే లేదు అని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ విషయంలో చరిత్ర హీనులుగా మిగలకూడదని.. మంచి ప్రణాళికను రచిస్తున్నాం. నన్ను విమర్శించేది ఓ దోపిడి దొంగ. నాగోల్ దగ్గర సుందరీకరణ పేరుతో జరిగిన దోపిడితో జైలులో వేయచ్చు. కానీ జైలులో తిండి కూడా దండుగ అన్నారు చిల్లర మల్లర మాటలు మానుకోండి. ప్రజలారా వాళ్లు వేసే ఉచ్చులో పడకండి అని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.