తెలంగాణలో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం – అమిత్ షా

-

తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బిజెపి ప్రభుత్వమేనని.. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి భారీ మెజారిటీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా. టైమ్స్ నౌ సమ్మిట్ 2022 లో పాల్గొన్న అమిత్ షా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకి తెలంగాణ పరిస్థితి తెలుసని అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పుని కోరుకుంటున్నారని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

అలాగే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక గత కొంతకాలంగా తెలంగాణలో బిజెపి వర్సెస్ టిఆర్ఎస్ అన్నట్లుగా రాష్ట్రంలో రాజకీయ పోరు తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది నవంబర్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి అన్న సంకేతాల నేపథ్యంలో ఏడాది ముందుగానే రాష్ట్రంలో రాజకీయ వేడి పెరిగిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news