తెలంగాణ ప్రభుత్వం మూడు విడుతల్లో రుణమాఫీ విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రకటించినట్టుగానే మూడు విడుతల్లో రూ.2లక్షల వరకు రుణమాఫీ చేశారు. మొదటి విడుత రూ.1లక్షలోపు, రెండో విడుత రూ.1.5లక్షల వరకు, మూడో విడుత రూ.2లక్షల వరకు విడుదల చేశారు. ఆగస్టు 15న విడుదల చేసిన రూ.2లక్షల రుణమాఫీ ఇంకా కొంత మందికి కాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారికి శుభవార్త చెప్పింది. అర్హత ఉన్న రుణమాఫీ కానీ రైతుల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఆధార్ లో తప్పుంటే.. ఆధార్ కి బదులుగా ఓటర్ లేదా రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లను పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే రైతు కుటుంబాలకు నిర్థారణకు సర్వే.. ఆధార్, బ్యాంకు ఖాతాలో తేడాలుంటే సరిచేసే పోర్టల్ నమోదు చేయనున్నారు. అసలు, వడ్డీ లెక్కలు సరిపోకపోతే ఇంటింటికి వెళ్లి ఫిర్యాదుల స్వీకరణ, కొత్తగా మార్గదర్శకాలు జారీ అంటూ ట్వీట్ చేసింది కాంగ్రెస్.