మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోలుకుంటున్నారు. వాకర్ సాయం తో నడిపించిన డాక్టర్లు.. ఫిజికల్లీ మెంటల్లీ కేసీఆర్ స్ట్రాంగ్ అన్నారు డాక్టర్లు. మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. 6 నుంచి 8 వారాల రెస్ట్ అవసరం అని చెప్పారు డాక్టర్లు. తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. త్వరిత గతిన కోలుకోవడానికి అనుకూలంగా కేసీఆర్ శరీరం సహకరిస్తోందని, మానసికంగా కూడా వారు దృఢంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేసిన పేషెంట్ల ను వారి వారి శారీరక మానసిక సామర్ధ్యాన్ని పరిశీలించి వారిని “మొబిలైజేషన్ స్టార్ట్” చేస్తారని డాక్టర్లు తెలిపారు. ఇందులోభాగంగా .. కేసీఆర్ గారిని బెడ్ బయటకు తీసుకొచ్చి కూచోబెట్టి వాకర్ సాయం తో నడిపించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ రావు మాట్లాడుతూ..“ కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి లో ప్రోగ్రెస్ బాగుంది. చాలా వేగంగానే రికవరీ అవుతున్నారు. వాకర్ తో బెడ్ బయటకు వచ్చి కూర్చున్నారు. వాకర్ సాయంతో మేము రూమ్ లో నడిపించే ప్రయత్నం చేసినపుడు కెసిఆర్ శరీరం బాగా స్పందించింది. వారు రూమ్ లో వాకర్ సాయం తో నడిచారు.
దీన్ని మెడికల్ పరిభాషలో “ మొబిలైజేషన్ స్టార్ట్” అంటారు.
హిప్ రీప్లేసెమెంట్ జరుగగానే పేషెంట్ ను నడిపించే ప్రయత్నం చేస్తాం. వారు ఆపరేషన్ నొప్పి తగ్గి “మినిమల్ పెయిన్” తో కోలుకుంటున్నారు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లు కూడా చేయిస్తున్నాం. మెడికల్ గా స్టేబుల్ గా ఉన్నారు. వారి బాడీ బాగా సహకరిస్తున్నది. మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉన్నారు. నార్మల్ ఫుడ్ తీసుకుంటున్నారు. మరికొద్ది రోజుల పాటు ఫిజియో థెరఫీ కొనసాగించాల్సి వుంటుంది. ఇట్లానే శరీరం సహకరిస్తే మరో రెండు మూడు రోజుల్లో కేసీఆర్ డిశ్చార్జ్ చేస్తాము” అని యశోద డాక్టర్ ప్రవీణ్ రావు తెలిపారు.