మోడీ వచ్చిన తర్వాత దేశానికి ఏం మంచి జరిగింది – కూనంనేని

-

ఈనెల 25 నుంచి నియోజకవర్గాల్లో ఇంటింటికీ సీపీఐ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో రాజ్యాంగాన్ని, హక్కులను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఆప్ ప్రభుత్వాలను కేంద్రం కూల్చివేయాలని చూస్తుందన్నారు. విచారణ సంస్థలను అడ్డుపెట్టుకుని రాజ్యాంగం ను కూల్చేయాలని చూస్తుందని ఆరోపించారు.

దేశంలో ఎన్నడూ లేనంతగా ఆకలి బాధలు, అసమానతలు పెరిగిపోయాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరణ చేసుకుంటున్నారని ఆరోపించారు. మోడీ వచ్చిన తర్వాత దేశంలో ఏం మంచి జరిగిందని ప్రశ్నించారు కూనంనేని. దేశంలో అత్యంత అవినీతి ప్రధాని నరేంద్ర మోడీయేనని అన్నారు. 2లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు మోదీ హయాంలో జరిగాయన్నారు. ఆయన నీతి, నిజాయితీ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అవినీతి లేని బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. మోడీ నుంచి దేశాన్ని కాపాడుకోవాలని కమ్యూనిస్టులు నిర్ణయించారని తెలిపారు కూనంనేని సాంబశివరావు.

Read more RELATED
Recommended to you

Latest news