వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన మంత్రి అభ్యర్థిగా పోటీ చేసేందుకు తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు అర్హుడు అని ఏఐఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తన సొంత రాష్ట్రమైన తెలంగాన సీఎం కేసీఆర్ పై అసదుద్దీన్ ఓవైసీ ప్రశంసల వర్షం కురిపించారు. వచ్చే ఏడాదిలో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రధాని రేసులో ఉంటే తప్పేంటని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ ఎంతో చేశారని.. తెలంగాణకు సముద్ర తీరం లేకపోయినా మెరుగైన జీఎస్డీపీతో ప్రగతి పథంతో దూసుకుపోతుందన్నారు. పంపుసెట్ల వినియోగంలో తెలంగాణ తొలిస్థానంలో ఉందన్నారు. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లు ఎంఐఎం ఐదుసీట్లు గెలుచుకుందని.. నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారు. వారిలో ఒకరు క్యాబినెట్ బెర్త్ కూడా పొందారు. 2025 లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 50 మంది అభ్యర్థులను నిలబెడతామని పేర్కొన్నారు. మరోవైపు ప్రధాని మోడీ, బీజేపీ పై విమర్శలు చేశారు ఓవైసీ.