విశాఖలో చంద్రబాబు పాదయాత్ర

-

నోవాటెల్‌ నుంచి ఆర్కే బీచ్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహం వద్దకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విచ్చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం సుమారు రెండున్నర కిలో మీటర్ల మేర పాదయాత్ర చేశారు చంద్రబాబు. అల్లూరి విగ్రహం వరకు 2.5 కిలోమీటర్ల మేర సద్భావన యాత్ర చేపట్టారు. చంద్రబాబు త్రివర్ణ పతాకం చేతబూని యాత్రలో పాల్గొన్నారు.

Chandrababu Naidu's 208-day foot march draws to a close - The Economic Times

పాదయాత్ర అనంతరం చంద్రబాబు ఎంజీఎం గ్రౌండ్ లో బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు. వివిధ వర్గాల మేధావులతో చర్చ కార్యక్రమం జరపనున్నారు. చంద్రబాబు రాక నేపథ్యంలో, జాతీయ జెండాల రెపరెపలతో విశాఖ బీచ్ లో భారీ కోలాహలం నెలకొంది. ప్రముఖులు, నగరవాసులు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news