మూసీ సుందరీకరణకు మీ ప్లాన్ ఏంటీ..? : జగదీష్ రెడ్డి

-

మూసీ సుందరీకరణకు మీ ప్లాన్ ఏంటీ..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తాజాగా ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. చెరువులు, మూసీ పరిస్థితి పై చర్చకు సిద్దమా..? అని ప్రశ్నించారు. మీ దగ్గర మూసీ పై డీపీఆర్ ఉందా..? మూసీని, హుస్సెన్ సాగర్ ని  మురికి కుంపం చేసింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. ఆరేళ్ల ఫ్లోరిన్ భూతాన్ని  తరిమికొట్టామన్నారు. సుందరీకరణ అంటే ఇండ్లు, గుడిసెలను కూలగొట్టడం కాదు.. ఎక్కడి నుంచి కాలుష్యం వస్తుందో వాటిని అరికట్టడమే అన్నారు. మా ప్రభుత్వ హయాంలో మూసీ సుంకరీకరణ ప్రారంభం అయింది. రూ.16వేల కోట్లు ఖర్చు అవుతుందని డీపీఆర్ ఇచ్చామని తెలిపారు. 

కాళేశ్వరం నీళ్లు కొండ పోచమ్మ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నీళ్లు తీసుకొచ్చి.. పరిశుభ్రమైన నీటిని తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు. మూసీ ప్రక్షాళన చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.. మాకు ఇచ్చే దమ్ముందా..? అని ఛాలెంజ్ చేశారు జగదీష్ రెడ్డి. లక్షయాబై వేల కోట్లతో మూసీ సుందరీకరణ అంటున్నారు. రుణమాఫీ చేయడానికే డబ్బులు లేవు.. మూసీ సుందరీకరణకు రూ.లక్ష యాబై వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version