రెండు లక్షల రుణ మాఫీ ఎప్పుడు చేస్తారు. రైతు కూలీలకు రూ.12వేలు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై తెలంగాణ ప్రజలు ప్రశ్నించాలి. నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలి. తెలంగాణలో కాంగ్రెస్ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని.. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
జూన్ 08న లేదా 09న మళ్లీ మోడీ ప్రధానిగా ప్రమాణం చేస్తారు. మోడీ హయాంలో మేకిన్ ఇండియాకి ప్రాధాన్యత ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో రూ.1200 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. గతంలో విదేశీ వస్తువులు ఇంపోర్టు అయ్యేవి. కానీ ఇప్పుడు ప్రతీ వస్తువు మనదేశంలోనే తయారవుతోంది అని తెలిపారు. ఈ దేశంలో విశ్వబ్రాహ్మణులు లేరా..? అని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో చిన్నపిల్లలకు సంబంధించిన ఏ ఆట వస్తువు అయినా అన్నీ భారతదేశంలోనే తయారవుతున్నాయని తెలిపారు.