కెసిఆర్ తన బిడ్డమీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు – రేవంత్ రెడ్డి

-

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశంపై స్పందించారు టిపిసిసి రేవంత్ రెడ్డి. అవినీతి ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను భర్తరఫ్ చేసిన కేసీఆర్.. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న తన బిడ్డ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలియడం లేదన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ పట్ల ఈడి ఏ విధంగా వ్యవహరించిందో, లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత పట్ల ఎలా వ్యవహరిస్తుందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

ఇక ధరణి సమస్యలపై మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే ధరణి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ధరణి పోర్టల్ తో ఎదురవుతున్న సమస్యలపై ఇప్పటికే టీపీసీసీ ఆధ్వర్యంలో సర్వే ప్రారంభించామని తెలిపారు. ధనవంతుల కోసమే కెసిఆర్ ధరణి పోర్టల్ తీసుకువచ్చారని మండిపడ్డారు. కెసిఆర్, మోడీ కలిసి భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news