తెలంగాణ‌లోకి విప్రో.. 90 శాతం స్థానికులకే ఉద్యోగాలు

-

తెలంగాణ రాష్ట్రంలోకి మ‌రో ప్ర‌పంచ స్థాయి ఐటీ కంపెనీ వ‌చ్చింది. మ‌న దేశానికి ప్ర‌ముఖ ఐటీ సంస్థ విప్రో.. తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి సిద్ధం అయింది. విప్రో చైర్మెన్ అజిమ్ ప్రేమ్ జీ తో పాటు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. అజిమ్ ప్రేమ్ జీ, కేటీఆర్ సంయుక్తంగా ఈ ప్ర‌క‌ట‌న చేశారు. రూ. 300 కోట్ల తో తెలంగాణ రాష్ట్రంలో విప్రో ఫ్యాక్ట‌రీ పెడుతుంద‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. అందులో 90 శాతం ఉద్యోగాల‌ను స్థానికులకే ఇవ్వ‌డానికి విప్రో కంపెనీ అంగీక‌రించింద‌ని ప్రక‌టించారు.

టీ ఎస్ ఐ పాస్ ద్వారా గ‌త రెండు ఏళ్ల‌లో తెలంగాణ రాష్ట్రంలో రూ. 2,20,000 కోట్ల పెట్టుబడులు వ‌చ్చాయని తెలిపారు. ఎవ‌రి సాయం లేకుండా.. త‌మ ప్ర‌భుత్వ‌మే క‌ష్టప‌డి ప్ర‌యివేటు కంపెనీల‌ను రాష్ట్రానికి తీసుకువ‌స్తున్నామ‌ని అన్నారు. ఒక ఫ్యాక్ట‌రీని రాష్ట్రానికి తీసుకురావ‌డానికి చాలా క‌ష్ట ప‌డాల్సి వ‌స్తుంద‌ని అన్నారు.

అలాగే విప్రో చైర్మెన్.. రాబోయే రోజుల్లో తెలంగాణ‌లో మ‌రిన్ని పెట్టుబ‌డులు పెడుతామ‌ని ప్ర‌క‌టించారు. అప్పుడు కూడా స్థానికుల‌కే ఉద్యోగ అవ‌కాశాలు ఇస్తామ‌ని వెల్ల‌డించారు. కంపెనీలు పెట్ట‌డానికి తెలంగాణ అనువైన రాష్ట్రం అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా స‌హకారం అందిస్తుంద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news