నేడు యాదాద్రి ఆల‌య ఉద్ఘాట‌న‌… 4 గంట‌ల నుంచి భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం పున‌ర్నిర్మించిన యాదాద్రి ఆల‌య ఉద్ఘాట‌న నేడే జ‌ర‌గ‌నుంది. గ‌త వారం రోజుల నుంచి బాలాల‌యంలో పంచ‌కుండాత్మ‌క మ‌హాయాగంలో మ‌హాపూర్ణాహ‌తి నిర్వ‌హించారు. దీంతో నేడు ఉద్ఘాట‌న జ‌ర‌గ‌నుంది. ఉద‌యం 9:30 గంట‌ల‌కు బాలాల‌యం నుంచి జ‌రిగే శోభాయాత్ర‌తో ఉద్ఘాట‌న ప్రారంభం అవుతుంది. శోభాయాత్ర వ‌స్తున్న క్ర‌మంలోనే మ‌హా కుంభ సంప్రోక్షణ చేప‌డ‌తారు. అలాగే ఉద‌యం 11 : 55 గంట‌ల‌కు మ‌హోత్స‌వం జ‌ర‌గ‌నుంది.

yadadri-temple

దీని త‌ర్వాత‌.. మ‌ధ్యాహ్నం 12 : 10 గంట‌ల‌కు ప్ర‌ధాన ఆల‌యం ప్ర‌వేశం తో పాటు గ‌ర్భాల‌యంలోని స్వ‌ర్ణ ధ్వ‌జ స్తంభ సంద‌ర్శ‌నం ఉంటుంది. అనంత‌రం 12 : 20 గంట‌ల‌కు గ‌ర్బాల‌యంలో స్వామి వారి ద‌ర్శ‌నం ప్రారంభం కానుంది. నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్.. కుటుంబ సమేతంగా వెళ్ల‌నున్నారు.

స్వామి వారిని ద‌ర్శించుకుని తొలి పూజలు చేయ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 12 : 30 నుంచి దాదాపు 20 నిమిషాల పాటు సీఎం కేసీఆర్ పూజా చేయ‌నున్నారు. సీఎం పూజా అనంత‌రం సాయంత్రం 4 గంటల నుంచి భక్తుల‌కు సర్వ ద‌ర్శ‌నానికి అనుమ‌తి ఇవ్వ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news