బంగారం, వెండి కొనుగోలు దారులకు వరుసగా రెండో రోజు భారీ ఊరట దక్కింది. గత రెండు రోజుల నుంచి బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడం లేదు. అలాగే నిన్న తగ్గిన వెండి ధరలు ఈ రోజు నిలకడగా ఉన్నాయి. సాధారణంగా ఉక్రెయిన్ – రష్యా మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావంతో మన దేశంలో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగాయి.
ఇప్పటికే బంగారం రూ. 52 వేల మార్క్ ను దాటింది. అలాగే వెండి కూడా రూ. 73 వేల మార్క్ ను క్రాస్ చేసింది. గత కొద్ది రోజుల నుంచి వరుసగా బంగారం, వెండి ధరలు పెరుగుతన్నాయి. ఇలాంటి సమయంలో వరుసగా రెండు రోజులు బంగారం, వెండి ధరలు పెరగకుండా ఉండటం భారీ ఊరటనే అని చెప్పాలి. కాగ ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్, విజయవాడ నగరంల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,200 గా ఉంది, అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,590 గా ఉంది.
అలాగే కిలో గ్రాము వెండి ధర రూ. 73,400 గా ఉంది.