కేసీఆర్ చేసినన్ని రాజీనామాలు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు చేయలేదు..!

-

LRS కోసం 25 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయనీ… వాటిని క్లియర్ చేస్తే ఆదాయం వస్తుందని భట్టి చెబుతున్నారు. LRS ఉచితంగా చేయాలని హైకోర్టు లో కేసు ఫైల్ చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. LRS పై కేసు విరమించుకుని ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి రెగ్యులరైజ్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది అని హరీష్ రావు పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి.. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే పదవికి కనీసం రాజీనామా చేయలేదు. నాడు కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కు రీజైన్ చేస్తూ జీరాక్స్ కాపీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి కనీసం జిరాక్స్ కాపీ కూడా ఇవ్వలేదు. కేసీఆర్ ఆమరణ నిరహార దీక్ష చేయకుంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చేదా?.. 2001 నుంచి 2014 వరకు తెలంగాణ గురించి రేవంత్ ఏ రోజు మాట్లాడలేదు. కేసీఆర్ చేసినన్ని రాజీనామాలు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు చేయలేదు. అమరవీరుల ఆత్మ త్యాగలని చిన్నగా చూపే ప్రయత్నం చేస్తున్నారు అని హరీష్ రావ్ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news