తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై వైయస్ షర్మిల ఫైర్ అయ్యారు. ‘‘మంచి నీళ్లు లేవు.పెన్షన్లు లేవు. డబుల్ బెడ్ రూం ఇల్లు లేదు. దోబీఘాట్లకు ఉచిత కరెంట్ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు రైతుకు సాయం లేదు.ఉచిత ఎరువులు లేవు.యూరియా రేట్లు పిరమైనయ్.రుణమాఫీ లేదు.మద్దతు ధరలేదు. రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నయ్’’ అన్నారు.
మాట–ముచ్చటలో ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట ప్రజల బాధలివి.ఇన్నిసమస్యలున్నా KCR మాత్రం ‘బంగారు తెలంగాణ చేసిన.ఇక బంగారు భారత్ చేస్తా’ అంటూ గప్పాలు కొడుతున్నాడని ఆగ్రహించారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మాతో పాదయాత్రకు రండి…సమస్యలు లేవంటే ఇంటికి వెళ్లిపోతానన్నారు.
సమస్యలుంటే ముక్కు నేలకు రాసి,మీ పదవికి రాజీనామా చేసి,దళితున్ని CM చెయ్…అని సీఎం కేసీఆర్ ను హెచ్చరించారు వైయస్ షర్మిల. పాలకులు ప్రజల కోసం తపించే వారై ఉండాలి. ప్రజలకు మేలు చేయాలన్నఆకాంక్ష ఉండాలి. అప్పుడే ప్రజలు బాగుపడతారు.YSRకు మంచి మనసుంది కాబట్టే గొప్ప పాలన చేయగలిగారు. KCRకు ఆ మనసు లేదు కాబట్టే అప్పుల తెలంగాణ, ఆత్మహత్యల తెలంగాణగా మారింది.మళ్లీ YSR సంక్షేమ పాలన తేవడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు.