మంత్రి కొప్పుల ఈశ్వర్ పై వైఎస్ షర్మిల కీలక ఆరోపణలు

-

ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా 199వ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మంచిర్యాల నియోజకవర్గం గూడెంగుట్ట నుంచి పాదయాత్రని ప్రారంభించారు. లక్షట్టిపేట మండలం పరిధిలోనిి ఇటిక్యాల, అంకాతిపల్లి సూరారం, గొల్లగూడ, హాజీపూర్ మండల పరిధిలోని దోనబండ, హాజీపూర్, ధర్మారం మీదుగా పాదయాత్ర సాగనుంది. నేడు హాజీపూర్ మండల కేంద్రంలో ప్రజాప్రస్థానం పాదయాత్ర 3000 కిలోమీటర్ల మైలురాయిని దాటనుంది.

పాదయాత్రలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా పాదయాత్రలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై కీలక ఆరోపణలు చేశారు. మంత్రి కొప్పుల భూకబ్జాలు, ఇసుక మాఫియా తో దండుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మనుషులనే కాకుండా.. దేవుళ్లను సైతం మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను నిండా ముంచిన కేసీఆర్, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు 420 లు, మెగా మోసగాల్లేనని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news