వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళకు షాకింగ్ ఘటన ఎదురైంది. ప్రజాప్రస్థానం పేరుతో షర్మిళ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసింది. ఇప్పటి పలు జిల్లాల్లో ఈ యాత్రను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. జిల్లాలో నాగారం గ్రామానికి పాదయాత్ర చేరుకున్న సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు షర్మిళపై చెప్పులు విసిరారు… వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. దీంతో అలెర్ట్ అయిన వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలపై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు ఎంటరై ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థిని అదుపులోకి తీసుకువచ్చారు.
ఇటీవల కాలంలో వైఎస్ షర్మిళ, అధికార టీఆర్ఎస్ పార్టీపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రజాసమస్యలపై ట్విట్టర్ వేదికగా నిలదీస్తున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ను విమర్శిస్తూ… ప్రశ్నిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ధాన్యం కొనుగోలు, నిరుద్యోగుల సమస్యలు, రైతు ఆత్మహత్యలు ఇలా ప్రజాసమస్యలపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీని, నేతలను ఘాటుగానే విమర్శిస్తున్నారు.