ప్రజలను వదిలేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భోగాలు అనుభవిస్తున్నారు.: వైఎస్ షర్మిళ

-

రెండుసార్లు టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ఏం చేసినట్టు? ముఖ్యమంత్రి మొదలు ఎమ్మెల్యేలంతా ఆస్తులు సంపాదించుకోవడం, ఫామ్ హౌజ్ లో బోగాలు అనుభవించడం. ప్రజలు దయతలిస్తే గెలిచామన్న ఇంగితం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ. యథా లీడర్ తథా కేడర్ ఉన్నట్లు ఉంది టీఆర్ఎస్ పరిస్థితి అని విమర్శించారు. అక్కడ కేసీఆర్, ఇక్కడ ఎమ్మెల్యేలు ప్రజలను గాలికొదిలి ఫామళ్ హౌజుల్లో భోగాలు అనుభవిస్తున్నారంటూ విమర్శించారు. జనం దయ తలిస్తే గెలిచామన్న సోయి కూడా లేదని ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. పోడు భూములకు పట్టాలు, 3 ఎకరాల భూమి, రుణమాఫీ, పంట నష్టపరిహారం, పంట బీమా, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, యంత్ర లక్ష్మీ ఇలా అన్నింటిని బంద్ పెట్టారని ఆరోపించారు. కేవలం రూ. 5 వేలు ఇచ్చి రైతులు కోటీశ్వరులయ్యారని చెబుతున్నారని… 60 ఏళ్లు దాటిన వాళ్లకు రైతు బీమా ఇవ్వరు కానీ.. ఈయన మాత్రం 68 ఏళ్లు ఉన్నా సీఎం పదవిలో ఉండొచ్చటన అని ఎద్దేవా చేశారు. 6 నెలల కింద మిర్చి రైతులకు పరిహారం ఇస్తామని చెప్పి… రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. రైతులు ఎలా బతుకుతున్నారన్న సోయి కూడా కేసీఆర్ కు లేదని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news