త్వరలోనే తెలంగాణా లో ఆయుష్మాన్ భారత్ అమలు కానుంది. ఆరోగ్యశ్రీ+అయుష్మాన్ భారత్ పేరుతో అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది తెలంగాణ సర్కార్. రెండు స్కీంలు కలయికతో వచ్చే సమస్యలు, సాధ్యసాధ్యాలపై ప్రభుత్వ కసరత్తు చేస్తోంది. అన్నీ ఒకే అయితే ఈ వారంలో అధికారిక ప్రకటన రానుంది. కరోనాతో పాటు అనేక వ్యాధులకు చికిత్స అందేలా చర్యలు తీసుకుంటోంది. ఆరోగ్యశ్రీ లో లేని 685 చికిత్సలు అయుష్మాన్ ద్వారా అనుసంధానం చేయాలని యోచిస్తోంది.
దేశంలో ఎక్కడైనా చికిత్స చేయించుకునే వెసులుబాటు ఉండనుంది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌ను మొదట ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రారంభించనుంది సర్కార్. ఆరోగ్యశ్రీలో ఒక కుటుంబానికి ఏడాదికి రూ.2 లక్షల వరకూ ఉచిత వైద్యం అందనుండగా ఆయుష్మాన్‌లో కలిస్తే రూ.5 లక్షల వైద్యం అందనుంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో 972 రకాల ట్రీట్‌మెంట్ ప్రొసీజర్స్ కవర్ అవుతుండగా, ఆయుష్మాన్‌లో 1,350 చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. రెండింటినీ కలిపి అమలు చేస్తే రాష్ట్ర ప్రజలకు 1,887 రకాల చికిత్సలకు ఉచిత వైద్యం అందనుంది. దీని కారణంగా 26.11 లక్షల కుటుంబాలకు మేలు జరుగనుంది.