జ‌గ‌న్ కేబినెట్లో బెర్త్ కోసం లిస్ట్ ఇంత పెద్ద‌దా…. సెకండ్ ట‌ర్మ్‌పై నేత‌ల ఆశ‌లు..!

-

ఏపీ సీఎం జగన్ ఒకేసారి 25 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని పాలన మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ విధంగా ఏ సీఎం కూడా ఒక్కసారే కేబినెట్ ఏర్పాటు చేయలేదు. విడతల వారీగా మాత్రం కేబినెట్ బెర్త్‌లని భర్తీ చేసుకుంటూ వచ్చేవారు. కానీ జగన్ అలా చేయలేదు ఒక్కసారే కేబినెట్ ఏర్పాటు చేసి, వారికి రెండున్నర ఏళ్ళు మాత్రమే సమయం ఇచ్చారు. రెండున్నర ఏళ్లలో పనితీరు బాగోని మంత్రులని పక్కనబెట్టేసి కొత్తవారికి అవకాశం కల్పిస్తానని జగన్ ముందే చెప్పేశారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్న అవుతోంది. మ‌రో యేడాదిలో జగన్ కేబినెట్ విస్తరణ చేయనున్నారు. కాకపోతే మండలి రద్దు నేపథ్యంలో ఇటీవల పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణలు మంత్రి పదవులకు రాజీనామా చేయడంతో, వారి స్థానాల్లో చెల్లుబోయిన వేణుగోపాల్, సీదిరి అప్పలరాజులని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

ఇలా కేబినెట్‌లో మార్పు రావడంతో ప్రతి జిల్లాలో ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులుగా ఉన్నారు. కానీ మోపిదేవి తప్పుకోవడంతో గుంటూరు జిల్లాలో ఒక్క మంత్రే మిగిలారు. హోమ్ మంత్రి సుచరిత గుంటూరు జిల్లాకు ఉన్నారు. రాజ‌ధాని జిల్లా పైగా గుంటూరు లాంటి పెద్ద జిల్లాకు ఒక్క మంత్రే ఉండ‌డం పార్టీకి పెద్ద లోటే అని సొంత పార్టీ వర్గాలే చ‌ర్చించుకుంటున్నాయి. అటు అనంతపురం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా ఒక్కరేసి చొప్పునే మంత్రులు ఉన్నారు. విశాఖలో అవంతి శ్రీనివాస్, అనంతలో శంకర్ నారాయణలు జగన్ కేబినెట్‌లో ఉన్నారు.

అయితే నెక్ట్స్‌ కేబినెట్ విస్తరణలో ఈ మూడు జిల్లాలకు మరో బెర్త్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మంత్రి పదవి దక్కించుకునేందుకు మూడు జిల్లాలో చాలామంది ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు. మూడు జిల్లాలో మంత్రి పదవి ఆశించే వారి లిస్ట్ పెద్దగానే ఉన్నట్లు తెలుస్తోంది.  గుంటూరులో ఆళ్ళ రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, విడదల రజిని…విశాఖలో గుడివాడ అమర్నాథ్, గొల్ల బాబూరావు మరికొందరు ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. అటు అనంతపురంలో అనంత వెంకట్రామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిలు మంత్రి పదవిని ఆశించే వారిలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news