రాహుల్ గాంధీది రాజా పుట్టుక.. కానీ ఉండటానికే ఇల్లు లేదు : జగ్గారెడ్డి

-

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా 7 దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. జూన్ 04న ఫలితాలు వెలువడనున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కాంగ్రెస్ సీనియర్ లీడర్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఇక ఈ సారి రాష్ట్ర నాయకుల గురించి కాకుండా.. ఏకంగా తమ పార్టీ అధినాయకుడైన రాహుల్ గాంధీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా తెలంగాణలోని గాంధీ భవన్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ది రాజా పుట్టుక.. కానీ ఇప్పుడు ఉండటానికి ఇల్లు కూడా లేదంటూ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. అలాగే దీనికి వివరణగా.. రాహుల్ గాంధీ ముత్తాత మోతిలాల్ నెహ్రూ ఆయనకున్న లక్షల ఆస్తులన్ని భారత స్వాతంత్య్ర ఉద్యమం కోసం ఇచ్చేశారు. అందుకే రాహుల్ గాంధీకి ఉండటానికి ఇల్లు కూడా లేదని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే ఈ ఎన్నికల్లో మనం రాహుల్ గాంధీని గెలిపించుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news