తెలుగు సినిమా నిర్మాతల కొత్త ట్రెండ్ గురూ.!

-

తెలుగు సినిమా పరిశ్రమ లోని నిర్మాత లు ఇప్పుడొక కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు. రీసెంట్ గా అల్లు అరవింద్ గారు  కాంతారా అనే కన్నడ సినిమా ను డబ్బింగ్ చేసి తెలుగు లో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. పెట్టిన డబ్బుకు ఎన్నోరెట్లు డబ్బులు వసూలు చేసి పెట్టింది. తర్వాత కింగ్ నాగార్జున కూడా తాను తమ్ముడు లా ఫీల్ అయ్యే తమిళ నటుడు  కార్తీ సినిమా సర్దార్ ను డబ్ చేసి రిలీజ్ చేశాడు. ఈ సినిమా కూడా మంచి వసూళ్లు సాధించింది.ఇదే క్రమంలో టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు కూడా ఓ హిట్ చిత్రాన్ని డబ్బింగ్ చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తమిళంలో మంచిగా ఆడుతున్న ‘లవ్ టుడే’ సినిమా హక్కులు తీసుకొని తెలుగులోకి డబ్బింగ్ చేయాలని చూస్తున్నారట. అంతేకాదు నవంబర్ 18న రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని కూడా అంటున్నారు.

ఇలా వీరు ఎందుకు చేస్తున్నారు అంటే ఆసక్తికరమైన జవాబు మీడియా సర్కిల్లో నానుతోంది. ఇప్పట్లో సినిమా తీయాలి అంటే ఎంత కష్టమైన విషయం అందరికి తెలిసిందే. హీరో, హీరోయిన్స్, డైరెక్టర్ డేట్స్ ఒక గోల, షూటింగ్, కార్ వాన్స్, ప్రొడక్షన్ మరో గోల. ఇంత చేసినా మళ్లీ సినిమా వాయిదా పడితే వడ్డీల గోల. ఇక సినిమా ఫ్లాప్ అయితే అంతే సంగతులు. ఇవ్వన్నీ వద్దని సినిమా బాగుంటే హుక్కులకు కొని, కొంత డబ్బు పెట్టి, థియేటర్స్ చూసుకుంటే చాలు బాగుంటే లాభాలే లాభాలు.అదే నష్టపోతే కొద్దిగా మాత్రమే పోతుంది.అందుకే నిర్మాతలు ఈ ట్రెండ్ సెట్ చేశారట

Read more RELATED
Recommended to you

Latest news