ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం మీడియా ముందు ప్రకటించే పథకాల విషయంలో ఒకలాగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ముందునుండి ఆరోపిస్తున్నాయి. చాలా సందర్భాలలో ఇటీవల అనేక ప్రభుత్వ పథకాలు ప్రకటించిన జగన్ సర్కార్..ఎక్కువగా తీసివేతల కార్యక్రమం చేశారని ఇది రద్దు ల ప్రభుత్వమని ప్రతిపక్ష పార్టీలు జగన్ ప్రభుత్వం ప్రకటిస్తున్న విధానంలో మరియు పరిపాలిస్తున్న లోపాలపై విమర్శలు చేస్తున్నాయి.
పెన్షన్ మరియు రేషన్ కార్డుల విషయాలలో కుంటి సాకులు చెబుతూ కత్తిరింపు కార్యక్రమాలు ఇటీవల చేపట్టడం ఆ తర్వాత వాటిని రద్దు చేయడం జరిగింది. కరెంటు బిల్లులు మరియు ఇంకొన్ని వాటికి సంబంధించి ఇంటిలో ఉంటే రేషన్ కార్డు కట్ ఇంకా పెన్షన్ కట్ అంటూ జగన్ ప్రభుత్వం ఇటీవల వ్యవహరించడంతో చాలా విమర్శలు వస్తున్నాయి.
ఇటువంటి నేపథ్యంలో ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళు లేనివారికి ఇళ్ళ స్థలాలు ఇవ్వబోతున్న ట్లు భారీ ఎత్తున ముందునుండి ప్రకటించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఇళ్ల స్థలాల విషయంలో జగన్ సర్కార్ వైసిపి పార్టీ నేత కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. దీంతో ఇళ్ల స్థలాల విషయంలో జగన్ సర్కార్ మొదటి ప్రాధాన్యత పార్టీ కార్యకర్తలకు ఇస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత మొదలవటం గ్యారెంటీ అని ప్రభుత్వం డేంజర్ జోన్ లో పడటం గ్యారెంటీ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.