దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలని అందిస్తోంది.
కస్టమర్లకు వివిధ రకాల సేవలని అందిస్తోంది. రికరింగ్ డిపాజిట్ అకౌంట్ సేవలుని కూడా ఇస్తోంది స్టేట్ బ్యాంక్. కస్టమర్లు మిలియనీర్లు అయిపోవచ్చు దీనితో. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూద్దాం. ప్రస్తుతం 6.75 శాతం వరకు వడ్డీ వస్తోంది.
టెన్యూర్ ప్రాతిపదికన వడ్డీ రేట్లు మారతాయని గుర్తించుకోవాలి. ఏడాది నుంచి రెండేళ్ల దాకా టెన్యూర్‌పై 6.75 శాతం వస్తుంది. రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు టెన్యూర్‌కు కూడా 6.75 శాతం వస్తుంది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల కి అయితే 6.25 శాతం వస్తుంది. ఐదేళ్ల నుంచి పదేళ్ల కి కూడా 6.25 శాతం వస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7.25 శాతం వడ్డీ వస్తుంది.
ఎస్‌బీఐ లో పదేళ్ల టెన్యూర్ తో రికరింగ్ డిపాజిట్ ని కనుక ఓపెన్ చేస్తే ప్రతి నెలా రూ. 6,200 చొప్పున డిపాజిట్ చెయ్యాలి. అంటే రోజు కి మీరు రూ.200 పొదుపు చెయ్యాలి. ప్రతి నెలా రూ. 6,200 చొప్పున పదేళ్ల పాటు పెడితే మెచ్యూరిటీ సమయంలో రూ. 10 లక్షలకు పైగా మీకు వస్తాయి. రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేయడానికి బ్యాంకు కి కూడా వెళ్ళక్కర్లేదు. యోనో యాప్ ద్వారా ఆర్‌డీ ఖాతా ని ఓపెన్ చేసుకోవచ్చు. ఆటో డెబిట్ ఫీచర్ కూడా వుంది.