ఏపీఎస్‌ఆర్టీసీలో మరో 263 అద్దె బస్సులకు టెండర్

-

ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఏపీఎస్ఆర్టీసీ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే బస్సుల సంఖ్యను పెంచుతోంది. ముఖ్యంగా  ఏపీఎస్‌ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. డిసెంబర్ నాటికి వెయ్యి అద్దెబస్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించిన యాజమాన్యం.. వాటిని దశలవారీగా రోడ్డెక్కించేలా చర్యలు చేపడుతోంది.

ఇందులో భాగంగా సంస్థలో మరో 263 అద్దెబస్సులు ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు జిల్లాల వారీగా కావాల్సిన అద్దె బస్సులకు టెండర్లు దాఖలు చేసేందుకు ప్రకటన జారీ చేసింది. 4 స్లీపర్, 6 నాన్ ఏసీ స్లీపర్, 12 సూపర్ లగ్జరీ, 15 ఆల్ట్రా డీలక్స్ బస్సులు తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. వీటితో పాటు 30ఎక్స్‌ప్రెస్‌, 95 ఆల్ట్రా పల్లెవెలుగు, 72 పల్లెవెలుగు బస్సులు, 27 మెట్రో ఎక్స్‌ప్రెస్‌, 2 సిటీ ఆర్డినరీ బస్సులను అద్దె ప్రాతిపదికన నడిపించనుంది.

అద్దె బస్సులు నడిపేందుకు ఆసక్తి కలిగిన వారు టెండర్లు దాఖలు చేయవచ్చని అధికారులు సూచించారు. ఈ నెల 23 ఉదయం 10 గంటల నుంచి అక్టోబర్ 10 వరకు బిడ్లు దాఖలు చేయవచ్చని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news