గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గాంధీ భవన్ పైకి రాళ్లు రువ్వారు. గాంధీభవన్ ను ముట్టడికి బీజేపీ నేతలు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులతో బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు. కొందరి పై పోలీసులు లాఠీ ఛార్జ్ కూడా చేసినట్టు సమాచారం. గాంధీ భవన్ పరిసరాల్లో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను చించివేసినట్టు సమాచారం. గాంధీ భవన్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
తొలుత ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా ఢిల్లీ రోడ్లు ఉన్నాయని బీజేపీ నేత రమేష్ బిధూరి వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ నేతలు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం పై దాడి చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు కర్రల, రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ దాడి ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కాంగ్రెస్ దాడికి నిరసనగా బీజేపీ నేతలు గాంధీ భవన్ ముట్టడికి యత్నించారు. కొంత మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.