వైసీపీ నేత వల్లభనేని వంశీ నివాసంపై కొంత మంది యువకులు రాళ్లు విసిరే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం నియోజకవర్గంలో చాలా అరాచకాలకు పాల్పడ్డారని మండిపడ్డారు .ప్రశ్నిస్తే దాడుల చేశారని ,ఇప్పటికైనా వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే యువకులను పోలీసులు అడ్డుకోని అక్కడి నుంచి పంపించి వేశారు.కానీ కొంతసేపటికి యువకులు మళ్లీ ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. వల్లభనేనికి దమ్ముంటే బయటకు రావాలని నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లా వైరల్ అవుతోంది.గతంలో కన్నుమిన్నుకానకుండా వల్లభనేని ప్రవర్తించారని, ఇప్పుటికైనా మారాలని సోషల్ మీడియా లో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా గత ఎన్నికల్లో గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి వల్లభనేని ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే టీడీపీ ఓడిపోయింది. దీంతో వల్లభనేని వంశీ వైసీపీకి మద్దతు తెలిపారు. ఆ తర్వాత గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేనితో పాటు ఆయన అనుచరులు రెచ్చిపోయి టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేశారు.