కాశ్మీర్ లో మళ్లీ ఎన్కౌంటర్.. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు

-

వరసల ఎన్కౌంటర్లతో జమ్ముూకాశ్మీర్ లో ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉన్నాయి. గత కొంత కాలంల నుంచి ఉగ్రవాదులు సామాన్య పౌరులను టార్గెట్ చేసి హత్యలకు తెగబడుతున్నారు. ముఖ్యంగా కాశ్మీర్ లోని మైనారిటీలు అయిన హిందువులు, సిక్కులపై కాల్పులకు తెగబడుతున్నారు. తాజాగా మరోమారు కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. బందీపోరా జిల్లా గంద్ జహంగీర్ ప్రాంతంలో ఉగ్రవాదులు, పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్ జరుగుతున్నట్లు కాశ్మీర్ పోలీసులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఎన్కౌంటర్ లో ఒక ఉగ్రవాది మరణించారు. ఇటీవల సామాన్యులను టార్గెట్ చేసుకుంటూ చంపెస్తున్న ఉగ్రవాది ఇంతియాజ్ అహ్మద్ దార్ ను పోలీసులు మట్టుపెట్టారు. అనంత్ నాగ్ లో జరిగిన మరో ఎన్కౌంటర్ లో మరో ఉగ్రవాదిని బలగాలు చంపేశాయి. ఇటీవల కాలంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు.

యూరీ లాంటి ఘటనలకు ప్లాన్ చేస్తుంది. ఇటీవల ఇలాంటి పథకంతో వచ్చిన ఉగ్రవాదులను భద్రతాబలగాలు హతమార్చాయి. మరోవైపు జమ్ము కాశ్మీర్లో ఎన్ఐఏ తీవ్రంగా సోదాలు నిర్వహిస్తోంది. వరసగా జరుగుతున్న ఘటనతో సామాన్యులు మరణిస్తుండటంతో కాశ్మీర్ ను జల్లెడ పడుతున్నాయి. తాజాగా సోదాల్లో ఇద్దరు లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. టెర్రరిస్టులు వారి సానుభూతిపరులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news