నేడు తిరుమలలో సీఎం జగన్ పర్యటన

నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నూతన చిన్నపిల్లల ఆస్పత్రి, అలిపిరి నడక మార్గం, అలిపిరి వద్ద నిర్మించిన గో మందిరం ప్రారంభించనున్నారు సీఎం జగన్. సాయంత్రం 5 గంటలకు తిరుమల రానున్న సీఎం జగన్.. సాయంత్రం 6 గంటలకు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం రాత్రి 7:30 గంటలకు గరుడ వాహనసేవలో పాల్గొననున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. రేపు ఉదయం 5 గంటలకు మరోసారి శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ఇక రేపు ఉదయం 6 గంటలకు ఎస్వీబీసి కన్నడ, హిందీ, చానల్స్ ప్రారంభిస్తారు సిఎం జగన్. ఉదయం 7 గంటలకు శ్రీవారి ఆలయం వెనక వైపు వున్న నూతనంగా నిర్మించిన బూంది పోటును ప్రారంభిస్తారు సిఎం జగన్. ఉదయం 8 గంటలకు అన్నమయ్య భవనంలో రైతు సాధికార సమస్త మధ్య అవగాహన ఒప్పందంపై సీఎం జగన్ సంతకం చేస్తారు. అలాగే ఉదయం 9 గంటలకు తిరుమల నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొనున్న సిఎం జగన్.. రేపు ఉదయం 11: 40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు‌.