జమ్మూ కాశ్మీర్ టెర్రర్ ఫండింగ్ కేసు: లష్కరే తోయిబా, కాశ్మీర్ వేర్పాటువాదులపై UAPA కింద కేసులు

-

జమ్మూ కాశ్మీర్ టెర్రర్ ఫండింగ్ కేసులో ఎన్ఐఏ కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. కాశ్మీర్ లో ఉగ్రవాదులకు నిధులను సమకూర్చుతున్నారనే అభియోగాలపై ఎన్ఐఏ కోర్ట్ విచారణ జరుపుతోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక ఆదేశాలను జారీచేసింది. లష్కరే తోయిబా ఛీఫ్ హఫీద్ సయీద్ తో పాటు హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ లపై వివిధ అభియోగాల కింద కేసులు నమోదు చేయాల్సిందిగా అధికారులను ఎన్ఐఏ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. వీరితో పాటు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలు పంచుకున్నందుకు కాశ్మీర్ వేర్పాటువాద నేతలైన యాసిన్ మాలిక్, షబ్బీర్ షా, మసరత్ ఆలంలపై UAPA ( Unlawful Activities Prevention Act) కింద కేసులు నమోదు చేయాల్సిందిగా ఎన్ ఐఏ కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. 

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్, దాని ఏజెన్సీలు, ఉగ్రవాదులకు నిధుల పంపారని.. కోర్ట్ పేర్కొంది. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఎప్పటి నుంచో పాక్ సాయం చేస్తోంది. దీనికి తోడు పాక్ అనుకూల, కాశ్మీర్ వేర్పాటువాదులు కూడా పాక్ తో అంటుకుతిరుగుతుంటారు. ప్రస్తుతం వీరందరిపై కేసులు నమోదు కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news