Tesla కంపెనీ కొత్త ఫోన్‌ను తీసుకురాబోతుంది. అదే టెస్లా Pi 5G ఫోన్. ఎలాన్ మస్క్ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతోందట. ప్రపంచమంతా ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ఎలాన్ మస్క్ కొత్త ఫోన్‌కు “టెస్లా పై ఫోన్ (Pi Phone) లేదా మోడల్ పి (Model P)” అని పేరు పెడతారు. ఐఫోన్‌లా పై ఫోన్ ఏమో..! అయితే మీడియాలో చెక్కర్లు కొడుతున్న రూమర్స్ ఇలా ఉన్నాయి.
ఆపిల్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ కోసం ఇన్నోవేటివ్ డిజైన్‌లను అందించిన నిపుణుడు ‘ఆంటోనియో డి రోసా’ టెస్లా స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేశారు. టెస్లా, స్టార్‌లింక్ స్పేస్‌ఎక్స్‌కు (Starlink SpaceX – ఎలాన్ మస్క్ కంపెనీ) గుర్తు చేసేలా ఫోన్ ఉంటుందని ఈ డిజైనర్ అంటున్నారు. ఐఫోన్ 12 తరహాలో టెస్లా మోడల్ పై ఫోన్ ఉండవచ్చు.
టెస్లా కార్ల లాగే టెస్లా ఫోన్ కూడా అత్యాధునిక సాంకేతికతతో రాబోతోందట. 6.5 అంగుళాల స్క్రీన్, AMOLED డిస్‌ప్లే, 16 GB లేదా అంతకంటే ఎక్కువ RAM, 1-2 TB నిల్వ సామర్థ్యం సహా ప్రతి స్టాండర్డ్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది.
హైలెట్ ఫీచర్ ఇదే..
స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్‌తో పనిచేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా శాటిలైట్ నుంచి నేరుగా హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. ఇదే ‘పై’ ఫోన్ బెస్ట్ సెల్లింగ్ పాయింట్ అవుతుంది. అంగారక గ్రహంపైకి వెళ్తే, ఈ ఫోన్‌లోని స్టార్‌లింక్ ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా, భూమిపై ఉన్న వ్యక్తులతో ఫోన్ చేసి మాట్లాడొచ్చు..మార్స్ మీద ఒక మానవ కాలనీ నిర్మించుకుంటే, వాళ్లలో వాళ్లు మాట్లాడుకోవడానికీ ఈ ఫోన్‌లోని కనెక్టింగ్ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుందట.
న్యూరాలింక్
ఈ ఫోన్‌లో ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంట్రా అంటే మెదడుతో అనుసంధానించగలగడం. ఈ స్మార్ట్‌ఫోన్‌లో న్యూరాలింక్‌ని (Neuralink- ఎలాన్ మస్క్ కంపెనీ) చేరుస్తున్నారు. భారీ విక్రయాలను తీసుకొచ్చే మరో గొప్ప అంశం ఇది. Samsung, Apple ఫోన్లలో ఈ టెక్నాలజీ లేదంటే మీరే అర్థంచేసుకోవచ్చు..
సోలార్ పవర్ ద్వారా ఛార్జ్
టెస్లా పై ఫోన్‌లో మరో అత్యాధునిక ఫీచర్.. ఛార్జ్ చేయడానికి ఎండ ఉన్న ప్రాంతానికి వెళితే చాలు. కరెంటు కోసం ఎదురు చూడడం, ఛార్జింగ్ పోర్ట్‌ల వెతుక్కోవడం చేయాల్సిన అవసరమే ఉండదు. బాగుంది కదా..!
క్రిప్టో మైనింగ్
వినియోగదారులపై స్మార్ట్‌ఫోన్ ద్వారా క్రిప్టో కరెన్సీ ‘మార్స్‌కాయిన్’ను (Marscoin) మైనింగ్ చేయవచ్చట. ఫలితంగా, తమ ఫోన్లలోనే వర్చువల్ కరెన్సీని పొందుతారట.
ఈ ఫీచర్స్ అన్నింటితో ఫోన్ రిలీజ్ అయితే బెస్ట్ ఫోన్ ఇదే అవుతుందేమో..ఇప్పటి వరకూ ఉన్న ఫోన్లలో లేనివి కూడా ఇందులో ఉండటం విశేషం. చూడాలి ఫోన్ రిలీజ్ అయితే క్రేజ్ ఎలా ఉంటుందో..!