God Father : ‘గాడ్‌ఫాద‌ర్’ ఫ‌స్ట్ సింగిల్ టైం ఫిక్స్‌..

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “గాడ్ ఫాదర్”. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా ‘లూసిఫర్ ‘ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తి అయిపోయింది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.

రాజకీయ నేపథ్యంలో జరగబోతున్న ఈ సినిమాలో సల్మాన్ మాఫియా డాన్ గా నటిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా.. చిరంజీవి సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. గాఢ్ ఫాదర్‌ సినిమా నుంచి బిగ్‌ సర్‌ ప్రైజ్‌ వచ్చింది. ఈ రోజు సాయంత్రం 4.05 గంటలకు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగల్ రిలీజ్ కానుంది. తార్ మార్ అంటూ సాగే ఈ లిరికల్ ను ఇవాళ విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news