అక్టోబర్ లో ‘వేట్టైయన్’ గా రాబోతున్న తలైవా..!

-

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఇటు దక్షిణాదిన మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం అయితే రజనీకాంత్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం వేట్టైయన్.ఈ సినిమాకు సంబంధించి నేడు ఆ మూవీ మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.వేట్టైయన్ ఈ సంవత్సరం అక్టోబర్ లో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని.. ఎరను వెంబడించడానికి సిద్ధంగా ఉండు’ అంటూ మూవీ మేకర్స్ పోస్టర్ ను విడుదల చేశారు.

ఇక మూవీ మేకర్స్ తమిళ్, ఇంగ్లీష్ భాషలలో ఉన్న 2 పోస్టర్స్ ను షేర్ చేశారు.ఇక ఈ పోస్టర్లో రజనీకాంత్ తనదైన స్టైల్ లో కూల్ షేడ్స్ ధరించి తన చేతిలో తుపాకీ పట్టుకొని చిరునవ్వుతో పలకరిస్తున్నట్లు కనపడతాడు. ఈ పోస్టర్ విడుదల అయిన కొద్ది సమయంలోనే నెట్టింట్లా వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి నెటిజెన్స్ స్పందిస్తూ.. వేటగాడు తన మార్కును మర్చిపోవడం ఉండదంటూ కామెంట్ చేస్తున్నారు.ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news