ఏపీ డ్వాక్రా మహిళకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్ 7 వ తేదీ నుంచి విజయ దశమి కానుకగా రెండో విడత ఆసరా అందజేయనుంది. రెండు విడత డబ్బుల పంపిణీ చేపట్టనుండటంతో విస్తృత అవగాహన మరియు ప్రచారం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు సెర్ప్ సీఈవో ప్రకటించారు. ఈ పథకం ద్వారా లబ్ది పొందే మహిళలు తమ జీవనోపాధులు పెంపొందించుకునేందుకు ముందుకొస్తే.. అదనంగా బ్యాంకు రుణాలు ఇప్పించేలా సెర్ఫ్ సిబ్బంది తోడ్పాటు అందిస్తారని వివరించారు.
ఈ పథకం ద్వారా ఏపీ వ్యాప్తంగా 87 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు రూ. 6470 కోట్ల మేర ప్రయోజనం చేకూరనుంది. వాలంటీర్లు, వీవోఏ, ఆర్పీలు ఇప్పటటికే తమ పరిధిలోని లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి సమాచారం అందిస్తున్నారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధఙలో ఈ నెల 24న మొదలైన ఈ కార్యక్రమం ఈ నెల 28 వరకు కొనసాగుతుంది. ఇక అక్టోబర్ 7 నుంచి నిధులు విడుదల కానున్నాయి. ఇక ఈ పథకం ద్వారా ఏకంగా 80 లక్షల మందికి పైగా లబ్ది పొందనున్నారు.