సర్కారు వారి పాట సినిమాలో ఒక్క సాంగ్ కోసం ఆరు నెలలు కష్టపడ్డాం… తమన్..!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను మే 12 వ తేదీన విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో అందులో భాగంగా ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

అయితే తాజాగా వాలెంటెన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 వ తేదీన ఈ సినిమా నుండి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం ప్రకటించింది.అందుకు తగినట్టుగానే ఈ లిరికల్ వీడియో సాంగ్ సంబంధించిన ప్రోమో ను కూడా కొన్ని రోజుల క్రితం చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ ప్రోమో సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. వాలెంటైన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సర్కారు వారి పాట కళావతి ఫస్ట్ సింగల్ సాంగ్ ఇప్పుడు నెట్టింట్లో ప్రత్యేక్షమయ్యింది.

ఇలా సాంగ్ లీక్ అవడంతో మహేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా సర్కారు వారి పాట టీజర్ కూడా ఇలాగే లీక్ అయ్యింది.అయితే కళావతి సాంగ్ లీక్ అవ్వడం పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆవేదన వ్యక్తం చేశారు. సాంగ్ లీక్ అవ్వడం చాలా బాధగా ఉందని తమన్ తెలియజేశాడు.

ఈ మేరకు తమన్ సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆరు నెలలు ఈ సాంగ్ కోసం చాలా కష్టపడ్డాం. షూటింగ్ సమయంలో చాలా మందికి కారోనా కూడా వచ్చింది. వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా కష్టపడ్డాం అని తమన్ తెలియజేశారు.మహేష్ అభిమానులకు తన టీమ్ తరపున తమన్ క్షమాపణలు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news