కరోనా వల్ల ఉద్యోగాల తీరే మారిపోయింది. చాాలా వరకు కంపెనీలు తమ నష్టాలను భరించేందుకు ఉద్యోగులను కూడా తీసేశాయి. ఇదిలా ఉంటే సాఫ్ట్ వేర్ కంపెనీలు మాత్రం వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి రెండేళ్లుగా దాదాపు 90 శాతం ఐటీ ఉద్యోగులు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇదిలా ఉంటే గత డిసెంబర్-జనవరి నుంచే ఉద్యోగులను ఆఫీసులకు రావాలంటూ.. పలు కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి. అయితే మరోసారి కరోనా తీవ్రత పెరగడంతో.. ఈ నిర్ణయాన్ని విరమించుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ నుంచి ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు రావాలంటూ.. కంపెనీలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి.
హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగుల్లో 40 శాతం మంది ప్రస్తుతం సొంతూళ్లలో ఉండి వర్క్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే వర్క్ ఫ్రం హోం వల్ల చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. మరోవైపు ఆఫీసులకు వెళ్తే.. భరోసా వస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక కంపెనీలు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.