బాలయ్య సినిమా తో తమన్ హిట్ ! మరి దేవీశ్రీ ప్రసాద్.!

-

నందమూరి బాలకృష్ణ  హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన సినిమా వీరసింహారెడ్డి  ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సందడి చేస్తోంది. ఇక ఈ సినిమా ముందు నుంచి ఊహించి నట్లు గానే పక్తు బాలయ్య బాబు ఫ్యాక్షన్ సినిమా లా ఉందని కామెంట్స్ వస్తున్నాయి.ఇక బాలయ్య ఫ్యాన్స్ కు మాత్రం సినిమా పండగ లా ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమా కు సంగీతం అందించిన తమన్ ఆత్మవిశ్వాసం తో చెప్పిన మాటలు నిజం చేసాడు.

ఇక అఖండ సినిమా లో మ్యూజిక్ ఇచ్చి అదర గొట్టిన తమన్ ఈ సినిమా కు కూడా అదిరి పోయే మ్యూజిక్ అందించానని తమన్ ఒక ఇంటర్వ్యూ సందర్బంగా చెప్పు కొచ్చాడు.నేపధ్య సంగీతం కూడా చాలా బాగా వచ్చింది.వీరసింహా రెడ్డి లో కూడా స్పీకర్లు పగులుతాయి. జాగ్రత్త అని ముందే చెప్పాను. బాలకృష్ణ గారిని చూస్తేనే ఎక్కువ వాయించేయాలని అనిపిస్తుంది అని చెప్పాడు.

ఇక అన్నట్టు గానే తమన్ మ్యూజిక్ ఇరగదీశాడు అని బాలయ్య బాబు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలయ్య బాబు డైలాగ్స్ కు , ఎలివేషన్స్ కు అధ్బుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం బాలయ్య సినిమాతో తమన్ టెస్ట్ పాస్ అయ్యాడు. ఇక రేపు థియేటర్స్ లో చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య విడుదలకు సిద్దంగా ఉంది. దీనికి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. రేపు తన మ్యూజిక్ ఎలా ఉంటుందో అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news