Breaking : సామాన్య భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్‌

-

సామాన్య భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులు బస చేసే అద్దె గదుల అద్దె ఏమాత్రం పెంచలేదని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి స్పష్టం చేశారు. వీఐపీల కోసం కేటాయించే గదుల్లో అద్దె వ్యత్యాసం లేకుండా చేసేందుకే నారాయణగిరి, ఎస్వీఆర్‌హెచ్‌, స్పెషల్‌ టైప్‌ విశ్రాంతి గృహాలను ఆధునీకరించి తగిన అద్దె నిర్ణయించామని పేర్కొన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలలో సామాన్య భక్తులపై అధిక భారం మోపారని కొన్ని ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తిరుమలలో మొత్తం 7500 గదులు ఉన్నాయని, వీటిలో సామాన్య భక్తుల కోసం రూ.50/-, రూ.100/- అద్దెగల గదులు సుమారు 5 వేల వరకు ఉన్నాయని వివరించారు. ఇటీవల ఈ గదుల్లో గీజర్‌, ఫర్నీచర్‌, ఫ్లోరింగ్‌ తదితర ఆధునీకరణ పనులు చేపట్టామని తెలిపారు.

వీటిని భక్తులకు అత్యంత సౌకర్యవంతంగా తీర్చిదిద్దామని, ఇందుకోసం విద్యుత్‌ చార్జీలు, ఇతర నిర్వహణ ఖర్చులకుగాను రోజుకు
రూ.250/- వ్యయం అవుతోందని చెప్పారు. సామాన్య భక్తుల కోసం రూ.100 కోట్లతో పిఏసి-5 నిర్మిస్తున్నట్టు తెలిపారు. వీఐపీలకు కేటాయించే నారాయణగిరి-1, 2, 3, 4 విశ్రాంతి గృహాలు, ఎస్వీఆర్‌హెచ్‌, స్పెషల్‌ టైప్‌, వివిఆర్‌హెచ్‌ విశ్రాంతి గృహాల్లోని మొత్తం 170 గదులను గీజర్‌, ఏసీ, ఉడెన్‌ కాట్‌, దివాన్‌ తదితర వసతులతో రూ.8 కోట్లతో ఆధునీకరించినట్టు వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news