తెలంగాణ సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖ నిర్మాత మరియు దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. సినీ పరిశ్రమలో మచ్చలేని అతి తక్కువ మందిలో ఈయన ఒకరని చెప్పవచ్చు. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం తమ్మారెడ్డి భరద్వాజకు రాజకీయ జాతీయ పార్టీ నుండి ఒక ఆఫర్ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈయనను ఢిల్లీ నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర నేతలు ఫోన్ చేసి మరీ పార్టీలోకి రావాలని ఆహ్వానించారట. కానీ ఇందుకు తమ్మారెడ్డి భరద్వాజ అవునని కానీ లేదా కాదని కానీ చెప్పకుండా తన నిర్ణయాన్ని ఒక వారం లోపు తెలియచేస్తానని చెప్పాడట. కానీ అధికార పార్టీ BRS కూడా ఈయనను పార్టీలోకి తీసుకోవడానికి ప్రయత్నాలు జరుపుతోందట.
అయితే ఎందుకు ఈయనను తమ పార్టీలోకి రావాలని అనుకుంటున్నాయి అంటే… ఈయనతో కమ్యూనిస్ట్ భావాలూ ఎక్కువగా ఉండడమే కారణమని తెలుస్తోంది.