పోలీసులపై టీడీపీ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం : తానేటి వనిత

-

పుంగనూరు ఘటన దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. ఎ1 ముద్దాయిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేస్తామన్నారు. ఈ తానేటి వనిత మీడియాతో మాట్లాడారు. ముందే నిర్ణయించిన రూట్‌లో చంద్రబాబు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. బీర్ బాటిళ్లు, రాళ్లు, కర్రలు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగారు. అడ్డుకున్న పోలీసులపై టిడిపి కార్యకర్తలు పాశవికంగా దాడి చేశారని దుయ్యబట్టారు.

Govt committed to empowerment of women: Taneti Vanitha

పుంగనూర్ లో జరిగిన ఘర్షణలో 40 మంది నిందితులను అదుపులోకి తీసుకొన్నామని హోంమంత్రి తానేటి వనితి వెల్లడించారు. ప్రజల్లో సానుభూతి పొందాలనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె తెలిపారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు ప్రసంగాలు చేయడం మానుకోవాలి అని సూచించారు. ఇదేనా చంద్రబాబు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటూ హోంమంత్రి ప్రశ్నించారు. ఈ ఘటనలో చంద్రబాబును ఏ1 నిందితుడిగా చేర్చాలని పోలీసులకు హోంమంత్రి తానేటి వనిత తెలియజేశారు. నిందితులను వదిలి పెట్టే ప్రసక్తి లేదని పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news