ఆయన స్వతహాగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ప్రముఖ లాయర్. అయితే, ఆ వర్గం ఆయనను పట్టించుకోదు. ఆయనే రాజమండ్రి మాజీ ఎంపీ, మేధావి.. ఉండవల్లి అరుణ్‌కుమార్. బ్రాహ్మణ సామాజిక వర్గమే అయినా.. ఆ వర్గం ఈయనను పట్టించుకోకపోవడానికి కారణం.. ఆయన రెడ్డి లేదా కమ్మ సామాజిక వర్గంతో పూసుకుని తిరిగారు తప్ప.. ఎప్పుడూ .. తన సొంత సామాజిక వర్గాన్ని పట్టించుకోలేదనే టాక్ ఉంది. పోనీ.. కమ్మలు ఆయనను అక్కున చేర్చుకున్నారా? అంటే అది కూడా తక్కువే. అంటీ ముట్టనట్టే ఉంటారు. ఆయన ఎప్పుడు ఏ గుట్టు బయట పెడతారో.. అని వీరి భయం.
దీంతో ఈ రెండు సామాజిక వర్గాల వారూ.. ఉండవల్లి విషయంలో సానుభూతి ఉన్నప్పటికీ.. పెద్దగా ఆయనపై ఫోకస్ చేయవు. మిగిలింది రెడ్డి సామాజిక వర్గం. ఈ వర్గానికి ఈయనంటే ఒకరకంగా ప్రాణమనే చెప్పాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉండవల్లి ఢిల్లీ వేదికగా బాగానే చక్రం తిప్పారు. అదేసమయంలో ఈనాడు రామోజీరావుపై వైఎస్ కనుసన్నల్లో పెద్ద పోరాటమే చేశారు. అంటే.. మొత్తంగా రెడ్డి కమ్యూనిటీ విషయంలో ఉండవల్లి సానుకూలంగా వ్యవహరిస్తున్నారనే టాక్ వచ్చేలా చేసుకున్నారు. నిజానికి ఏపీ కాంగ్రెస్‌లో రెడ్డి సామాజికవ ర్గం హవా కూడా ఎక్కువగా ఉన్నందున ఆయన దూకుడు పెంచారని అనుకోవచ్చు.
అయితే, తాజా పరిణామాలపై ఉండవల్లి చేసిన వ్యాఖ్యలతో రెడ్డి సామాజికవర్గంలో ఉన్న సింపతీ,.. మేధావి అనే ముద్ర తుడిచిపెట్టుకుపోయిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ న్యాయవ్యవస్థపై పోరాటానికి దిగారు. ఏకంగా మరికొన్నాళ్లలో సుప్రీం చీఫ్ జస్టిస్ పీఠాన్నిఅధిరోహించనున్న జస్టిస్ ఎన్వీరమణపైనే విమర్శలు చేశారు. దీనికి కమ్మ వర్గం తీవ్రంగా రియాక్ట్ అయింది. భారీ ఎత్తున జగన్‌ను దులిపేస్తోంది. దేశవ్యాప్తంగా కూడా జగన్‌పైదుమారం రేపేలా బాగానే వర్కవుట్ చేసింది.
ఈ క్రమంలో రెడ్డి వర్గం మౌనం పాటించింది. ఇక, ఇప్పుడు ఈ విషయంలో జోక్యం చేసుకున్న ఉండవల్లి.. జగన్‌ను సమర్ధించారు. న్యాయమూర్తులపైలేఖలు రాయడం కొత్తకాదన్నారు. దీంతో రెడ్డి కమ్యూనిటీ ఒక్క పెట్టున ఎగిరి గంతేశారు! హమ్మయ్య.. మాకు మద్దతుగా ఓ వాయిస్ వచ్చిందని సంబరాలకు సిద్ధమయ్యారు. అయితే.. అక్కడితోఆగని ఉండవల్లి .. జగన్ బాబాయి కేసును తెరమీదికి తెచ్చారు. గ్యాగ్ ఆర్డర్‌పై మాట్లాడారు. అప్పట్లో వివేకా హత్య కేసుకు సంబంధించి ఇదే హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది కదా.. అప్పుడు నువ్వెందుకు స్వాగతించావు.. ఇప్పుడెందుకు గగ్గోలు పెడుతున్నావంటూ ప్రశ్నించారు. దీంతో రెడ్డి వర్గానికి దిమ్మతిరిగిపోయింది.
అంతటితోనూ ఆగని ఉండవల్లి.. అనేక కేసుల్లో జగన్ ఉన్నాడు.. విచారణ జరుగుతోంది.. శిక్షలు పడనివ్వండి చూద్దాం.. అంటూనే.. అసలు వైఎస్ కనుక బతికి ఉంటే.. ఆయనే తొలి నిందితుడు అయ్యేవారు అని ముక్తాయించారు. అంతే.. అప్పటి వరకు టీవీలు చూస్తున్న రెడ్డి వర్గం మొత్తం టీవీలను కట్టేసి.. బయటకు వచ్చేశారు. దీంతో ఉండవల్లి.. అటు బ్రాహ్మణ, ఇటు కమ్మ.. ఇప్పుడు రెడ్డివర్గానికి కూడా దూరమయ్యారనే టాక్ జోరుగా వినిపిస్తోంది.
-vuyyuru subhash