సూర్య హీరో అందుకే అయ్యాడంట..!

-

తెలుగు చిత్ర పరిశ్రమలోనూ.. తమిళ ఇండస్ట్రీలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూర్య. తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా సూర్య ప్రస్తుతం స్టార్ హీరో. సౌత్ నుండి ఉత్తరాదిన కూడా మంచి గుర్తింపు ఉన్న హీరోల్లో సూర్య కూడా ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన సినిమాల్లో ప్రస్తుతం రారాజు. కాని ఒకప్పుడు ఆయన సినిమాల్లోకి ఆసక్తి చూపించలేదు.

surya
surya

అయితే 1995లో వచ్చిన మొదటి అవకాశంను ఆయన ఆసక్తి లేకపోవడం వల్ల ఒప్పుకున్నాడు. కానీ తన తండ్రి చేసిన పాతిక వేల రూపాయల అప్పును తీర్చలేని పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఇంటి పెద్ద కొడుకుగా ఉన్న సూర్య తప్పనిసరి పరిస్థితుల్లో హీరోగా నటించేందుకు ఒప్పుకున్నట్లు ఆయన తెలిపాడు. తనకు వచ్చిన మొదటి పారితోషికం రూ.50 వేలతో తన తండ్రి 25 వేల రూపాయల అప్పును తీర్చాడట. ఈ విషయాన్ని తాజాగా ఆకాశమే నీ హద్దురా సినిమా ప్రమోషన్ సందర్బంగా మీడియా ముందు చెప్పి సూర్య ఎమోషన్ అయ్యాడు.

ఇక సూర్య హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు ఒక గార్మెంటరీ ఫ్యాక్టరీలో జాబ్ చేసినట్లు కూడా తెలిపారు. ఒక నిర్మాత కొడుకును అనే విషయం చెప్పకుండా ఉద్యోగం సంపాదించి సూర్య 8 నెలల పాటు కష్టపడి పని చేశారంట. ఆ తర్వాత 1997లో మణిరత్నం నిర్మించిన నెర్రుక్కు నెర్ సినిమాతో సూర్య ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. 2001లో నందా సినిమాతో సూర్య హీరోగా గుర్తింపు దక్కించుకున్నాడు. అప్పటి నుండి అంటే 20 ఏళ్లుగా సూర్య తన సక్సెస్ జర్నీని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు ఆకాశమే నీ హద్దురా సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news