అంటే సుందరానికి… సినిమా ప్రకటించిన నానీ

న్యాచురల్ స్టార్ నానీ ఇప్పుడు సినిమాల స్పీడ్ పెంచాడు. కరోనా కాలంలో కాస్త వెనక్కు తగ్గిన నానీ ఇప్పుడు మాత్రం వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఒక ఫ్లాప్ వచ్చినా సరే వెంటనే తేరుకుని సినిమాలు చేసే నానీ వీ సినిమా తర్వాత మాత్రం కాస్త కంగారు పడ్డాడు. ఇప్పుడు మరో సినిమా షూట్ కి రెడీ అయ్యాడు. అంటే సుందరానికి అనే టైటిల్ తో నానీ ఒక సినిమాను ప్రకటించాడు.

ఈ సినిమాను వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ ని విడుదల చేసారు. నవీన్ యెర్నేని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను తీసుకొస్తుంది. ఈ సినిమాలో నజరియా హీరోయిన్ గా నటిస్తుంది.