జూలై 2వ తేదీన ఏర్పడనున్న సంపూర్ణ సూర్య గ్రహణం మన దేశంలో మాత్రం కనిపించదు. ఎందుకంటే భారత కాలమానం ప్రకారం రాత్రి 10.25 గంటలకు మన దేశంలో సూర్య గ్రహణం ప్రారంభమవుతుంది.
సూర్యునికి, భూమికి మధ్యలో చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ గ్రహణాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ ఎప్పుడూ వచ్చేవి పాక్షిక గ్రహణాలే. సంపూర్ణ గ్రహణాలు చాలా సంవత్సరాలకు ఒకసారి గానీ రావు. ఈ క్రమంలోనే జూలై 2వ తేదీన సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడనుంది. అయితే అది ప్రపంచంలోని ఏయే దేశాల్లో కనిపిస్తుందంటే…
జూలై 2వ తేదీన ఏర్పడనున్న సంపూర్ణ సూర్య గ్రహణం మన దేశంలో మాత్రం కనిపించదు. ఎందుకంటే భారత కాలమానం ప్రకారం రాత్రి 10.25 గంటలకు మన దేశంలో సూర్య గ్రహణం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ఎలాగూ చీకటి ఉంటుంది కనుక.. మనకు గ్రహణం కనిపించదు. కానీ మనకు వ్యతిరేక దిశలో భూమిపై ఉన్న దేశాల్లో ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు.
కాగా ఈ సంపూర్ణ సూర్య గ్రహణాన్ని చిలీ, అర్జెంటీనాల్లోని కొన్ని ప్రాంతాల్లో, పసిఫిక్, దక్షిణ అమెరికా, ఈక్వెడార్, బ్రెజిల్, ఉరుగ్వే, పరాగ్వేలలోని కొన్ని ప్రాంతాల్లో వీక్షించవచ్చు. అయితే మన దేశంలో డిసెంబర్ 2020న ఏర్పడనున్న సంపూర్ణ సూర్య గ్రహణాన్ని మనం వీక్షించేందుకు అవకాశం ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.