తెలుగు బిగ్ బాస్ షో: ఈవారం ఎలిమినేషన్ ఆమేనా.!!

-

తెలుగు బిగ్ బాస్ షో ఇప్పటికే 5 సీజన్స్ పూర్తి చేసుకొని 6 సీజన్ కూడా రన్ అవుతోంది.. అసలే అంతగా ఫేమ్ లేని వారు రావటం వల్ల రేటింగ్ రావడం లేదు. అలాగే ఆడే వారు కూడా దెబ్బలు తగలకుండా , ఎవరికి ఇబ్బంది లేకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇక ఈ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ చాలా మంది ఎలిమినేట్ అయి పోయారు.

దీనితో బిగ్ బాస్ షో రేటింగ్ పెంచడం కోసం రకరాలుగా షో నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కొత్తగా ఇంట్లో  గ్లామర్ గా కనిపిస్తున్న శ్రీ సత్య ను ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఇక ఈ వారం  నామినేషన్ విషయంలో  శ్రీ సత్యకు మాత్రం తాజాగా బిగ్ బాస్ పెద్ద షాక్ ఇచ్చాడు. ఈ వారం ఆమెను ఎలిమినేషన్ లోకి తెచ్చాడు.

ఇక చాలా మంది ఈమె ఓవర్ యాక్షన్ చూడలేక బ్రహ్మానందం గారి టైప్ లో నాగార్జున గారు ఈమెను ఎలిమినేట్ చేసేయండి అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ముందు నుంచి శ్రీ సత్య ఆట తో కాకుండా, గ్లామర్ తోనూ, సింపతీ తోనే నెట్టుకుని వస్తోంది. ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ వారంలో ఆమె ఎలిమినేషన్ ఖాయం అని చాలా మంది భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version