అందుకే నేను వికెట్ కీపర్ అయ్యాను: రిషబ్ పంత్

-

2019 ప్రపంచ కప్ తర్వాత భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో పంత్ వికెట్ కీపర్ గా బాధ్యతలు చేపట్టాడు. అయితే తాను వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టడానికి గల కారణాన్ని వెల్లడించాడు పంత్. తన తండ్రిని ఆదర్శంగా తీసుకొని వికెట్ కీపర్ అయినట్లు పంత్ తెలిపాడు. జూన్ 9న దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న టి20 సిరీస్ కు భారత జట్టు లో భాగమై ఉన్నాడు. అంతేకాకుండా ఈ సిరీస్ కు టీమిండియా వైస్ కెప్టెన్ గా పంత్ ఎంపికయ్యాడు.

” నేను వికెట్ కీపింగ్ బాగా చేస్తున్నానో లేదో నాకు తెలియదు. కానీ నేను ఆడే ప్రతి మ్యాచ్ లోనూ 100% ఎఫెక్ట్ పెడతాను. నేను ఎప్పుడూ వికెట్-కీపర్,బ్యాటర్నే. మా నాన్న కూడా వికెట్-కీపర్ కావడంతో నేను చిన్నప్పుడు నుంచే వికెట్ కీపింగ్ చేయడం మొదలుపెట్టాను. మా నాన్నను ఆదర్శంగా తీసుకునే ఈరోజు నేను వికెట్-కీపర్ అయ్యాను. ఏ క్రికెటర్ అయినా వికెట్ కీపర్ కావాలంటే చాలా యాక్టివ్ గా ఉండాలి. చివరి వరకు బంతి పై దృష్టి పెట్టి అందుకునే ప్రయత్నం చేయాలి” అని పంత్ ఎస్జి పోడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news