ఆ కారణంగానే సినిమాల్లో నటించలేకపోయాను : సమంత

-

టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనే కాకుండా వివిధ ఇండస్ట్రీలలో చాలా సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ల ని కూడా సొంతం చేసుకుంది సమంత.  ఏ మాయ చేసావే సినిమాతో సమంత తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చి మంచి హీరోయిన్ గా ఈమె పేరు తెచ్చుకుంది.

ఇదిలా ఉంటే సమంత తన జీవితంలో జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నారు.మయోసైటిస్ కారణంగా సినిమాలు చేయలేకపోయానని.. అదే తన జీవితంలో కఠిన నిర్ణయమని ముద్దుగుమ్మ సమంత తెలిపారు. ఆరోగ్యం సహకరించకే తన వృత్తిని కొనసాగించలేకపోయానని చెప్పారు. ’13 సంవత్సరాలుగా సినిమాల్లో నటిస్తున్నా. ఈ జర్నీలో కోపం, ఆత్మన్యూనతకు లోనయ్యా అని ఆమె తెలిపారు. నాలోని అభద్రతా భావాలు తెలుసుకున్నా. వీటన్నింటినీ అధిగమించి నన్ను నేను మలుచుకున్నా అని అన్నారు. నా కష్టసుఖాల్లో అండగా నిలిచే అభిమానులకు రుణపడి ఉంటా’ అని ఆమె పేర్కొన్నారు.ఇక రాబోయే రోజుల్లో సమంత మళ్ళీ సినిమాల్లోకి వచ్చి యధావిధిగా కొనసాగించాలని సమంత ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news