ఇప్పుడున్న యంగ్ హీరోయిన్స్ లో శ్రీ లీల కి యూత్ లో మాంచి ఫాలోయింగ్ ఉంది. తాను సినిమాలు వరసగా చేస్తుండడం వల్ల తన క్రేజ్ ఎక్కడా తగ్గడం లేదు. అందానికి అందం, చలాకి తనం, డాన్స్ తో కుర్రాళ్ళు ను థియేటర్స్ కు వచ్చేలా చేస్తోంది. ఇక రీసెంట్ గా రవితేజ తో చేసిన ధమాకా సినిమా రికార్డ్ వసూళ్ళు కొల్ల గొడుతోంది. తాజగా ఈ సినిమా 100 కోట్ల వసూళ్లు దాటింది.
ఇక ఈ సినిమా తో అమ్మడు గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.ప్రస్తుతం అమ్మడి చేతిలో ఇప్పటికిప్పుడు 6 సినిమాలు ఉన్నాయంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమె డేట్స్ రెండు సంవత్సారాల వరకు ఖాళీ లేదంటే చూసుకోండి. ఈమె యవ్వారం చూసిన రవితేజ ఆమెతో నెక్స్ట్ సినిమా కు నాకు డేట్స్ దొరికేలా లేవు అని అన్నాడంటే ఆమె పాపులారిటీ అలా ఉంది. ఇక రీసెంట్ గా రెమ్యునరేషన్ కూడా డబుల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె ఎంత అడిగినా ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.
రీసెంట్ గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీలీల తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంది. ముఖ్యంగా తనని విసిగించే మాటలు మాట్లాడితే మాత్రం తనకి వెంటనే కోపం వస్తుందట. ఆ క్రమంలో ఆమె ఒక్కసారిగా కోపంతో తో తన నోటికి పని చెబుతా అని , ఆ టైంలో అమ్మ ఉన్నా ఎవరున్నా చూడను అని చెప్పింది. అలాగే కోపంఎంత త్వరగా వస్తుందో.. అంతే త్వరగా చల్లారి పోయి బాధ కలుగుతుంది అని చెప్పింది. ఇక మా అమ్మ మాత్రమే నన్ను అర్ధం చేసుకొని తట్టుకుంటుంది, అందుకే ఆమె నా పక్కనే ఉంటుందని చెప్పుకొచ్చింది.