వైసీపీ ఘోర ఓటమితో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.తాజాగా టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి రాజీనామాను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు ఆయన రాజీనామాను ఆమోదిస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి కరికాల వలవన్ ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించి గెలుపొందారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ ని గత ఆగస్టు నెలలో నియమిస్తూ అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
2004 నుండి 2006 వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు భూమన తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) చైర్మన్‌గా పనిచేశారు . 2006 నుంచి 2008 వరకు టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన ఆయన.. 2023లో మరోసారి టీటీడీ చైర్మన్‌గా నియమితులయ్యారు.