పవర్ ఎంజాయ్ చేద్దామనుకుంటే కుదరదు.. పవన్ స్వీట్ వార్నింగ్

-

పార్టీ ఎమ్మెల్యేలకు జనసేనాని పవన్ కళ్యాణ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన 20మంది ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ‘పాతతరం రాజకీయాలకు కాలం చెల్లింది. అప్పటిలా కూర్చొని పవర్ ఎంజాయ్ చేద్దామనుకుంటే కుదరదు అని అన్నారు. ప్రజలు మనకు ఎంత మద్దతిచ్చారో వారికి కోపం వస్తే అంతే బలంగా నిలదీయగలరు. ఏదైనా సందర్భంలో వారు ఓ మాట అంటే భరించాలి. ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయవద్దు’ అని పవన్ సూచించారు.

కాగా, రేపు ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణ చేయనున్నారు.బుధవారం 11.27 నిమిషాలకు నాలుగో సారి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంతేకాకుండా జనసేన  డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news